పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు

Home Minister Mohammed Mahmood Ali Inaugurates Steel Bridge at Punjagutta

పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని జూన్ 19, శుక్రవారం నాడు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్,‌ తదితరులు పాల్గొన్నారు. రూ.6 కోట్ల బల్దియా నిధులతో నిర్మించిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి వలన పంజాగుట్ట- జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్టు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా పలు ఏర్పాట్లు చేస్తుందని, ఈ వంతెన నిర్మాణ పనులు లాక్‌డౌన్‌ సమయంలో కూడా జరిగినట్లు చెప్పారు. తక్కువ సమయంలోనే ఈ బ్రిడ్జిని నిర్మాణానికి తోడ్పడిన అధికారులు, సిబ్బందికి మంత్రులు అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu