గిరిజనుల ప్రాంతాల్లో టీచర్ పోస్టులపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

AP CM YS Jagan, AP News, AP Political Updates, Chandrababu Naidu, Chandrababu Writes a Letter to AP CM, Chandrababu Writes a Letter to AP CM over Loss of Jobs to Tribal People, Loss of Jobs to Tribal People, TDP, TDP Chief Chandrababu, TDP Chief Chandrababu Writes a Letter to AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.3 అమలు చేయాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ, “స్వతంత్ర భారతదేశంలో గిరిజనులెవ్వరూ వారి ప్రగతికి గల అవకాశాలను పోగొట్టుకోకూడదని, దోపిడీకి గురికాకూడదని నాటి రాజ్యాంగ పరిషత్ లో ఒకే ఒక గిరిజన ప్రతినిధి జైపాల్ సింగ్ ముండా పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగ నిబద్దత ప్రకారం గిరిజనులకు ఎదిగే అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ వైసీపీ ప్రభుత్వానికి అలాంటి నిబద్దత ఏదీ లేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వల్ల స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34 శాతం నుండి 24 శాతానికి తగ్గిపోయి, బీసీలు తమ రాజకీయ సాధికారతను కోల్పోవలసివచ్చింది. ఇక ఇప్పుడు గిరిజనుల వంతు వచ్చిందని” అన్నారు.

“గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం జనవరి 10, 2000 తేదీన జీవో నెం.3ని తెచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఆ జీవో ఇప్పుడు అమలు కాకుండా పోయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వంలో ఏ స్పందనా లేదు. గిరిజన ప్రగతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇప్పటికైనా గిరిజనుల హక్కులను, అవకాశాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాసాను. గిరిజనులకు సమాన అవకాశాలు దక్కేలా తెలుగుదేశం నిరంతరం పోరాడుతుందని” చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =