భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 14,516 కరోనా పాజిటివ్ కేసులు, 375 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి చెందడం మొదలయ్యాక అత్యధికంగా ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 20, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,95,048 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే కొత్తగా నమోదైన 375 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 12948 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 2,13,831 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,68,269 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 4వ స్థానంలో, కరోనా మరణాల్లో 8వ స్థానంలో నిలిచింది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 20 June, 2020, 08:00 AM)➡️Confirmed cases: 395,048
➡️Active cases: 168,269
➡️Cured/Discharged/Migrated: 213,831
➡️Deaths: 12,948#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/Psmd3uLWiu
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu