రైల్వే శాఖలో 1.4 లక్షల ఉద్యోగాలకు డిసెంబర్ 15 నుంచి పరీక్షలు

Indian Railways, indian railways exams, indian railways exams 2020, indian railways exams News, Indian Railways to Start Computer Based Tests, Indian Railways to Start Computer Based Tests for 1.4 Lakh Notified Vacancies, RRB recruitment 2020

దేశంలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. నోటిఫైడ్ ఖాళీల కోసం డిసెంబర్ 15, 2020 నుండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) లను ప్రారంభించబోతోంది. రైల్వే శాఖలో 3 విభాగాల్లో 1.40 లక్షల ఖాళీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, దాదాపుగా 2.40 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంతకు ముందే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. డిసెంబర్ 15 నుంచి మొదలయ్యే పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

నాన్‌ టెక్నికల్‌ పాపులారిటీ-ఎన్‌టీపీసీ కేటగిరీలో (గార్డులు, ఆఫీస్‌ క్లర్క్‌లు, కమర్షియల్‌ క్లర్క్‌ల పోస్టులు) 35,208, ఐసోలేటెడ్ మరియు మినిస్టీరియల్ కేటగిరిలో (స్టెనో, టీచ్‌లు) 1663, లెవల్-1 ఖాళీలు (ట్రాక్ మెయింటెనర్‌లు, పాయింట్‌మ్యాన్) 103769 తో కలిపి రైల్వేశాఖలో మొత్తం 1.4లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here