తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు భక్తులకు దర్శనం రద్దు

Lord Venkateswara, Solar Eclipse, Solar Eclipse News, Solar Eclipse On SUnnday, Solar Eclipse Updates, Tirumala Tirupati Devasthanam, TTD, TTD Cancels Darshans Due to Solar Eclipse, TTD Cancels Devotees Darshans On Sunday, TTD Darshans, TTD Darshans Cancel On Sunday

సూర్యగ్రహణం కారణంగా జూన్ 21, ఆదివారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తునట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు ప్రకటించింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్య గ్రహణం ఉన్న నేపథ్యంలో జూన్ 20, శనివారం నాడు ఏకాంత సేవ అనంతరం రాత్రి 8.30 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేసి, ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలు తెరవనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

అనంతరం శుద్ధి, కైంకర్యాలు జరిపి రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నారు. జూన్ 22, సోమవారం ఉదయం నుంచి తిరిగి శ్రీవారి ఆలయంలో దర్శనాలకు భక్తులను టీటీడీ అనుమతించనుంది. కరోనా లాక్‌డౌన్ వలన రెండునెలలు పైగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించలేదు. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం జూన్ 11 నుంచి టీటీడీ పలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు అనుమతినిచ్చింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + thirteen =