రెండో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లోకి 24 వేలు

AP CM YS Jagan, AP News, AP Political Updates, Nethanna Nestham, Nethanna Nestham Scheme, YS Jagan Launches Second Phase of YSR Nethanna Nestham Scheme, YS Jagan Launches YSR Nethanna Nestham Scheme, YSR Nethanna Nestham, YSR Nethanna Nestham Scheme

కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వరుసగా వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న చేదోడు పథకాల ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించారు. ఇక ఈ రోజు (జూన్ 20, శనివారం) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ ద్వారా మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు అందించనున్నారు. అందులో భాగంగా వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని సీఎం ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 81,024 చేనేత కుటుంబాలు లబ్దిపొందనుండగా, వారి ఖాతాల్లోకి రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల కారణంగా 6 నెలల ముందుగానే ప్రభుత్వం ఈసారి సాయం అందిస్తుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లావారీగా‌ లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu