ఏపీ సచివాలయంలో మరో 10 మందికి కరోనా పాజిటివ్

10 AP Secretariat Employees Tested Positive, Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP Secretariat Coronavirus, AP Secretariat Coronavirus Cases, AP Secretariat Employee Test Positive for Coronavirus, AP Secretariat Employees

ఆంధ్రప్రదేశ్ లో జూలై 2, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16097 కి చేరింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయంలో మరికొన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 25న సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ రోజు పలితాలు వచ్చాయి. సచివాలయంలో 10 మందికి, అసెంబ్లీలో ఇద్దరికి, జలవనరులశాఖలో ముగ్గురికి, పశు సంవర్థకశాఖలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు వెల్లడించారు. దీంతో సచివాలయం, అసెంబ్లీలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25 దాటినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కరోనా పాజిటివ్ గా తేలిన వారితో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu