అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ సమాచారం ప్రకారం జూలై 1, బుధవారం నాడు ఒక్కరోజే అమెరికాలో 52 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో అమెరికాలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 27,80,152 కు చేరింది. అలాగే ఈ వైరస్ వలన 1,30,798 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది. అలాగే కరోనా మరణాల్లో కూడా అమెరికా మొదటి స్థానంలోనే ఉంది. అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, భారత్, యూకే దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu