రేపు వైఎస్ఆర్ జయంతి, కడప చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh AP CM YS Jagan, AP CM YS Jagan, AP CM YS Jagan Reached to Kadapa District, YS Jagan Kadapa Tour, YSR Birth Anniversary, YSR Birth Anniversary As Farmers Day, YSR Birth Anniversary Celebrations

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ కు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ హరికిరణ్, కర్నూల్ రేంజ్ డీఐజీ, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు బయలుదేరారు.

రేపు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. అలాగే రేపు ఆర్.కే వ్యాలీ వద్ద ఆర్జీయూకేటికి చేరుకొని కొత్త భవన సముదాయానికి సీఎం ప్రారంభోత్సవం చేయనున్నారు. 3 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇడుపులపాయ అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి సాయంత్రం తాడేపల్లికి చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu