డిగ్రీ, పీజీ పరీక్షలు చివరి సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడంటే?

Home Ministry Allows Universities to Conduct Exams, UGC Committee, UGC Guidelines, ugc press release, UGC Released Revised Guidelines, UGC revised guidelines for examination 2020, UGC Revised Guidelines on Examinations, Universities to Conduct Exams, Update for students

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డిగ్రీ, పీజీ సహా వివిధ కోర్సుల చివరి సెమిస్టరు/చివరి సంవత్సరం పరీక్షలపై సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడిన తుది సంవత్సర పరీక్షలను దేశంలో అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు నిర్వహించుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పరీక్షల నిర్వహణ అనుమతిపై కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ క్రమంలో యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సవరించిన మార్గదర్శకాలను ప్రకటించింది. పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించి నియమించిన కమిటీ సూచించిన సిఫార్సులను జూలై 6 వ తేదిన జరిగిన అత్యవసర సమావేశంలో ఆమోదించినట్టు యూజీసీ పేర్కొంది.

పరీక్షల నిర్వహణకు సంబంధించి యూజీసీ సవరించిన మార్గదర్శకాలు:

  • భారతదేశంలో కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, న్యాయమైన మరియు సమాన అవకాశాలను పరిరక్షించడం చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా విద్యా విశ్వసనీయత, కెరీర్ అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్ పురోగతిని నిర్ధారించడం చాలా కీలకం. విద్యావ్యవస్థలో పరీక్షల నిర్వహణ కీలకమైన అంశం. అలాగే పరీక్షలలో సాధించే విజయాలు విద్యార్థులకు విశ్వాసాన్ని, సంతృప్తిని కలిగిస్తాయి.
  • టెర్మినల్ సెమిస్టర్ లు లేదా చివరి సంవత్సరం పరీక్షలను యూనివర్సిటీలు/విద్యా సంస్థలు  సెప్టెంబర్, 2020 చివరి నాటికి ఆఫ్‌లైన్ (పెన్ మరియు పేపర్)/ఆన్‌లైన్/రెండు కలిపి (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్) మోడ్‌లో నిర్వహిస్తాయి.
  • బ్యాక్‌లాగ్ లు కలిగిఉన్న టెర్మినల్ సెమిస్టర్/చివరి సంవత్సరం విద్యార్థులకు ఉన్నఅనుకూలతలను బట్టి తప్పనిసరిగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బ్లెండెడ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి.
  • ఒకవేళ టెర్మినల్ సెమిస్టర్/చివరి సంవత్సరం విద్యార్థులు యూనివర్సిటీలు నిర్వహించిన పరీక్షలో హాజరు కాలేకపోతే, అలాంటి వారికీ ప్రత్యేక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇవ్వవచ్చు. యూనివర్సిటీలు సాధ్యమైనప్పుడు వారికీ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి / ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు. ఈ నిబంధన ప్రస్తుత అకాడమిక్ సెషన్ 2019-20కి మాత్రమే ఒకేసారిగా వర్తిస్తుంది.
  • 29.04.2020 న ప్రకటించిన విధంగా ఇంటర్మీడియట్ సెమిస్టర్/సంవత్సర పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలలో ఎలాంటి మార్పులు ఉండవు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =