140 మంది టీటీడీ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

140 TTD Staff Tested Positive, 140 TTD Staff Tested Positive for Covid-19, Coronavirus, coronavirus news, TTD Chairman, TTD Chairman YV Subba Reddy, TTD Coronavirus, TTD Coronavirus News, TTD Staff Tested Positive, YV Subba Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 140 మందికి పాజిటివ్ తేలినట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జూలై 16, గురువారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో అర్చకులు, లడ్డులు తయారు చేసే సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు,సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా 40 మంది అర్చకులలో 14 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని, ఈ నేపథ్యంలో 60 సంవత్సరాలు నిండిన అర్చకులకు విధుల నుండి సడలింపు ఇచ్చినట్టు చెప్పారు.

కరోనా నేపథ్యంలో మళ్ళీ శ్రీవారి దర్శనాల నిలిపివేత వార్తలపై స్పందిస్తూ, దర్శనాలను నిలిపివేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అలాగే మరి కొన్నాళ్ళు దర్శనాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం ఉండదని పేర్కొన్నారు. తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ట్వీట్లపై స్పందిస్తూ టీటీడీ పై అలా బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదని, ఏదైనా సమస్యలు ఉంటే రమణ దీక్షితులుతో చర్చించాలని అధికారులకు సూచించినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =