నగరి వైసీపీలో ఎన్నికల వేళ రాజుకున్న నిప్పు

Nagari Constituency Is Fire On YCP Party At The Time Of Election, Nagari Constituency Is Fire On YCP, Fire On YCP, Nagari Constituency Is On Fire, Peddireddy, Nagari, YCP, Election, Minister Roja, Murali Reddy, YCP District President Bharat, Assembly Elections, Lok Sabha Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Peddireddy ,Nagari, YCP, election,Minister Roja, Murali Reddy, YCP district president Bharat

ఏపీలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు హీటెక్కుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అసంతృప్త రాగాలు వినిపించడంతో పార్టీ కేడర్ అయోమయానికి గురవుతుంది. ముఖ్యంగా నగరిలో కొన్నాళ్లుగా వైసీపీలో  రగులుకుంటున్న నిప్పు ఇంకా చల్లారకపోవడమే కాకుండా.. ఎన్నికల వేళ పార్టీకి తలనొప్పిగా మారనుండటంతో అధిష్టానం దీనిపై దృష్టి సారించింది.కొన్నాళ్లుగా  మంత్రి ఆర్కే రోజా  ప్రాతినిథ్యం వహిస్తోన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ఒంటెద్దు పోకడ నచ్చని వైసీపీ నేతలు.. బాహాటంగానే తమ వ్యతిరేక గళాలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

రోజాను వ్యతిరేకిస్తున్న కొంతమంది వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరగా.. మరికొంతమంది మాత్రం అక్కడే ఉంటూ.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో  మంత్రి రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారిపై వైసీపీ చర్యలకు పూనుకుంది వడమాలపేట జెడ్పీటీసీ మురళీ రెడ్డిని పార్టీ నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మురళీ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందడంతో చర్యలకు పూనుకున్నట్టు ఆయన చెప్పారు.

తాజాగా మంత్రి రోజా వద్దు.. పార్టీ ముద్దు.. అంటూ వ్యాఖ్యానించిన మురళీరెడ్డి.. నగరిలో రోజా ఓడిపోతుందంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ బహిరంగంగా  చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని మంత్రి రోజా అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేయడంతో  ఈ విషయాన్ని సీరియస్ తీసుకుంది.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారంటూ.. మురళీరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసింది .

మరోవైపు ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న తనకు ఇలాంటి శిక్ష విధిస్తారా అంటూ మురళీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడుగా ముద్రపడిన మురళీరెడ్డిపైనే ఇప్పుడు వేటు పడడంతో  ఏపీ  రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌హాట్‌గా మారిపోయాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =