జూలై చివరి కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం జగన్

Andhra Pradesh, Andhra Pradesh Political News, AP BC Sub Caste Corporations, AP CM YS Jagan, AP News, BC Sub Caste Corporations, Formation of BC Sub Caste Corporations, YS Jagan Conducts Review on Formation of BC Sub Caste Corporations

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి జూలై 20, సోమవారం నాడు బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై చివరి కల్లా బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. కొత్త వాటితో కలుపుకుని మొత్తం 52 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో లాగా 69 కులాలకే కాకుండా, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పోరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా‌ పేర్కొన్నారు.

బీసీల్లోని అని కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా, లేదా అనే విషయాన్ని కార్పోరేషన్లు పర్యవేక్షించాలని‌ ఆదేశించారు. అలాగే అందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని సీఎం సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికి 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల రూపాయలను వివిధ పధకాల కింద నగదు బదిలీ ద్వారా అందజేసినట్టు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu