మనందరి సైనికులే పోలీసులు, విధి నిర్వహణలో అమరులైన వారికి సెల్యూట్ – సీఎం జగన్

AP CM YS Jagan Attends Police Commemoration Day-2022 at IGMC Stadium Vijayawada Today, AP CM YS Jagan Mohan Reddy, Police Commemoration Day, IGMC Stadium, Mango News,Mango News Telugu, Police Commemoration Day-2022, Police Commemoration Day IGMC Stadium, Police Commemoration Day Vijayawada, AP Police Commemoration Day, AP Police Latest News And Updates, AP Police IGMC Stadium Commemoration, Police Commemoration, Police Commemoration 2022, AP Police Commemoration

మనందరి సైనికులే పోలీసులని, విధి నిర్వహణలో అమరులైన వారికి ప్రజల తరపున మరియు ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ (ఐజిఎంసి) స్టేడియంలో జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తొలుత స్టేడియంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొలిసు అమర వీరులకు నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకోవడంతో పాటు వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో విధి నిర్వహణలో 11మంది పోలీసులు అమరులయ్యారని, ఇలా విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. పొలిసు శాఖలో 6,511 పోస్టుల భర్తీకి ఆదేశాలిచ్చానని, ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై కొంతమేరకైనా ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే హోంగార్డుల నియామకాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళల రక్షణ కోసం దాదాపు 16వేలమంది మహిళా పోలీసులను నియమించామని, ఒక మహిళకు హోంమంత్రి పదవిని ఇచ్చామని  సీఎం జగన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 3 =