ఖమ్మంలో కోవిడ్-19 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ సెంటర్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Khammam, Minister Puvvada Ajay, Minister Puvvada Ajay Kumar Launches Rapid Antigen Test Center in Khammam, Rapid Antigen Test Center, Rapid Antigen Test Center in Khammam, telangana, Telangana Coronavirus, Telangana Minister Puvvada Ajay

కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. జూలై 20, సోమవారం నాడు గాంధీచౌక్ లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కోవిడ్-19 (ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్) నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అవసరమైన వారికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్ఓ మాలతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =