కరోనా ఎఫెక్ట్: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2020 వాయిదా

ICC, ICC Mens T20 World Cup, ICC Mens T20 World Cup 2020, ICC Mens T20 World Cup 2020 Postponed, ICC Mens T20 World Cup Postponed, t20, T20 World Cup 2020, T20 World Cup 2020 Postponed, World Cup 2020

కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో అక్టోబ‌ర్ 18 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వరకు జరగాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2020 ‌ను వాయిదా వేస్తున్నట్లుగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూలై 20, సోమ‌వారం నాడు ప్ర‌క‌టించింది. ఈరోజు జరిగిన ఐబిసి ​​బోర్డు(ఐసిసి యొక్క వాణిజ్య అనుబంధ సంస్థ) సమావేశంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2021, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2022, ఐసీసీ వరల్డ్ కప్ -2023 కి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఐసీసీ ఈవెంట్స్ తదుపరి షెడ్యూల్ వివరాలు:

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2021: అక్టోబర్ – నవంబర్ 2021 మధ్యన జరగనుంది, ఫైనల్ 14, నవంబర్ 2021 న జరుగుతుంది.
  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2022: అక్టోబర్ – నవంబర్ 2022 మధ్యన జరుగనుంది, ఫైనల్ 13, నవంబర్ 2022 న జరుగుతుంది.
  • ఐసీసీ వరల్డ్ కప్ -2023: అక్టోబర్ – నవంబర్ 2023 మధ్యన భారత్ లో జరగనుంది, ఫైనల్ 26, నవంబర్ 2023 న జరుగుతుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here