మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Former President, former President of India, Former President Pranab Mukherjee, Pranab Mukherjee, Pranab Mukherjee Tests Positive, Pranab Mukherjee Tests Positive For COVID-19

దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “వేరే పని నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు కరోనా పాజిటివ్ గా తేలింది. గతవారం రోజుల్లో నాతో సంప్రదించిన వ్యక్తులంతా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ, పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని” ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మరోవైపు ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 22,15,074 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu