ఏపీలో నూతన పారిశ్రామిక విధానం విడుదల

Andhra Pradesh industrial policy, Andhra Pradesh unveils new Industrial Policy, AP industrial policy, AP New Industrial Policy, Industrial development policy, Mekapati Goutham Reddy, Minister Mekapati Goutham Reddy, New Industrial Policy, New Industrial Policy of AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఆగస్టు 10, సోమవారం నాడు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ, అనుమతులు వేగవంతం చేసి, సులువైన నిబంధనలతో ‘వైఎస్ఆర్ ఏపీ వన్’ పేరిట సింగిల్‌ విండో కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితిల్లో ఈ పారిశ్రామిక విధానం మూడేళ్ల పాటుగా 2020 నుంచి 2023 వరకు అమలు చేయనున్నట్టు తెలిపారు

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన విధానం రూపొందించినట్టు చెప్పారు. ఈ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. అలాగే ఎమ్ఎస్ఎమ్ఈ లకు సాయంగా నిలవనున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్, పెట్రోకెమికల్స్‌ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలతో వస్తే అదనపు రాయితీలు కూడా ఉంటాయని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =