ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…

List of Ministers, Chief Whips and Whips who Unfurls the National Flag in Telangana on August 15

ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లో, జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌లు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో‌ నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలను నిర్వహించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే:

  1. ఆదిలాబాద్‌ : కర్నె ప్రభాకర్‌ – ప్రభుత్వ విప్
  2. భద్రాద్రి కొత్తగూడెం :‌ రేగా కాంతారావు – ప్రభుత్వ విప్
  3. జగిత్యాల : కొప్పుల ఈశ్వర్‌ – రాష్ట్ర మంత్రి
  4. జయశంకర్‌ భూపాలపల్లి : ‌ భాను ప్రసాదరావు – ప్రభుత్వ విప్
  5. జనగామ : బోడకుంటి వెంకటేశ్వర్లు – ప్రభుత్వ చీఫ్‌విప్‌
  6. జోగులాంబ గద్వాల : ‌ దామోదర్‌ రెడ్డి – ప్రభుత్వ విప్
  7. కామారెడ్డి : పోచారం శ్రీనివాస్‌ రెడ్డి – శాసనసభ స్పీకర్
  8. ఖమ్మం : పువ్వాడ అజయ్‌ కుమార్‌ – రాష్ట్ర మంత్రి
  9. కరీంనగర్‌ : గంగుల కమలాకర్‌ – రాష్ట్ర మంత్రి
  10. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : అరికెపూడి గాంధీ – ప్రభుత్వ విప్‌
  11. మహబూబ్‌నగర్‌ : వి.శ్రీనివాస్‌గౌడ్‌ – రాష్ట్ర మంత్రి
  12. మహబూబాబాద్‌ : సత్యవతి రాథోడ్‌ – రాష్ట్ర మంత్రి
  13. మంచిర్యాల : బాల్క సుమన్‌ – ప్రభుత్వ విప్‌
  14. మెదక్‌ : తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ – రాష్ట్ర మంత్రి
  15. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : బోయినపల్లి వినోద్ కుమార్ – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
  16. ములుగు : ‌ ప్రభాకర్‌రావు – ప్రభుత్వ విప్
  17. నాగర్‌కర్నూల్‌ : గువ్వల బాలరాజు – ప్రభుత్వ విప్‌
  18. నల్గొండ : గుత్తా సుఖేందర్‌ రెడ్డి – శాసనమండలి చైర్మన్‌
  19. నారాయణపేట : నేతి విద్యాసాగర్‌ – శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌
  20. నిర్మల్‌ : ఇంద్రకరణ్‌ రెడ్డి – రాష్ట్ర మంత్రి
  21. నిజామాబాద్‌ : వేముల ప్రశాంత్‌ రెడ్డి –
  22. పెద్దపల్లి : ఈటల రాజేందర్‌ – రాష్ట్ర మంత్రి
  23. రాజన్న సిరిసిల్ల : కే. తారక రామారావు – ‌ రాష్ట్ర మంత్రి
  24. రంగారెడ్డి : సబితా ఇంద్రారెడ్డి – రాష్ట్ర మంత్రి
  25. సంగారెడ్డి : మహముద్‌ అలీ – రాష్ట్ర మంత్రి
  26. సిద్దిపేట : హరీష్‌రావు – రాష్ట్ర మంత్రి
  27. సూర్యాపేట : జగదీష్‌ రెడ్డి – రాష్ట్ర మంత్రి
  28. వికారాబాద్‌ :‌ పద్మారావు – శాసన డిప్యూటీ స్పీకర్
  29. వనపర్తి : నిరంజన్‌ రెడ్డి – రాష్ట్ర మంత్రి
  30. వరంగల్‌ రూరల్‌ : ఎర్రబెల్లి దయాకర్‌రావు – రాష్ట్ర మంత్రి
  31. వరంగల్‌ అర్బన్‌ : దాస్యం వినయ భాస్కర్‌ – ప్రభుత్వ చీఫ్‌విప్‌
  32. యాదాద్రి భువనగిరి : గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి – ప్రభుత్వ విప్‌

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu