మునుగోడు ఉపఎన్నిక: కారు గుర్తుని పోలిన మరో 8 గుర్తులను తొలగించాలని ఈసీని కోరిన టీఆర్ఎస్

Munugode Bypoll TRS Leaders Request EC To Remove Eight Identical Symbols Like Their Party Symbol Car, TRS Request EC To Remove 8 Identical Symbols, TRS Request EC To Remove Their Identical Party Symbol Car, Munugode Bypoll TRS, Mango News, Mango News Telugu, gode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

నవంబర్ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమ బాలలు, బలహీనతలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో పోలింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తమ పార్టీ గుర్తుపైనే బటన్ నొక్కేలా అన్ని పార్టీలూ తమ గుర్తులను ప్రచారంలో ప్రస్తావిస్తుంటాయి. అయితే అధికార టీఆర్‌ఎస్‌కు ఈ గుర్తుల విషయంలో కొన్ని చికాకులు ఎదురవుతున్నాయి. తమ పార్టీ గుర్తు ‘కారు’ని పోలిన ఒకేలాంటి గుర్తులు దాదాపు 8 వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆ పార్టీ ఈసీని కలిసింది. ‘ఉచిత చిహ్నాల’ జాబితా నుంచి ఆ ఎనిమిది చిహ్నాలను తొలగించాలని కోరుతూ టీఆర్‌ఎస్ నేతలు సోమవారం ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై 48 గంటల్లోగా స్పందించాలని ఈసీని కోరిన టీఆర్ఎస్.. ఒకవేళ ఈ గడువులోపు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టుని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌కు వినతి పత్రం ఇచ్చారు. రోలర్, డోలీ, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు యంత్రం మరియు ఓడ గుర్తులు బ్యాలెట్‌పై చూడటానికి ఇంచుమించు ఒకేలా ఉన్నాయని, దీంతో తమ పార్టీ గుర్తు కారుపై ఓటు వేయాలనుకునే ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని ఈసీ దృష్టికి తెచ్చారు. ఈవీఎంలలో ఈ చిహ్నాల పరిమాణం చాలా తక్కువగా కనిపిస్తుందని, దీంతో నిరక్షరాస్యులు మరియు వృద్ధ ఓటర్లు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలోని వారికి కారు గుర్తుకు మరియు ఈ చిహ్నాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ నేతలు వివరించారు.

గత ఎన్నికల్లో కూడా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రులకు కేటాయించిన ‘ఒకేలా ఉండే గుర్తులు’ గుర్తింపు పొందిన జాతీయ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని, ఆ గుర్తులు టీఆర్‌ఎస్‌కు చెందినవని ఓటర్లు భావిస్తున్నారని స్పష్టంగా తెలియజేస్తోందని టీఆర్‌ఎస్ పేర్కొంది. దీనికి 2018లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన రోడ్ రోలర్, కెమెరా మరియు టెలివిజన్ చిహ్నాలను ఉదాహరణగా టీఆర్‌ఎస్‌ పేర్కొంది. టోపీ, ఇనుప పెట్టె, ట్రక్కు, ఆటో రిక్షాల చిహ్నాలను ‘ఉచిత చిహ్నాల’ జాబితా నుంచి గతంలో ఈసీ తొలగించిందని టీఆర్‌ఎస్‌ గుర్తు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =