ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్ డ్రీమ్ 11

Dream 11 wins title sponsorship rights, Dream11, Dream11 wins IPL 2020 title sponsorship, Dream11 wins IPL 2020 title sponsorship rights, Dream11 wins IPL title rights, Dream11 Wins Rights for Rs 222 Crore, IPL, IPL 2020, IPL-2020 Title Sponsorship

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కి సంబంధించి వివో‌‌ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టైటిల్‌ స్పాన్సర్‌ కోసం బీసీసీఐ బిడ్డింగ్ నిర్వహించగా ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 స్పాన్సర్‌షిప్‌ హక్కులను దక్కించుకుంది. డ్రీమ్ 11  స్పాన్సర్‌షిప్ హక్కులను రూ.222 కోట్ల బిడ్ తో గెలుచుకుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. డ్రీమ్ 11 నాలుగు నెలల 13 రోజులు పాటు హక్కులు కలిగి ఉండనుంది. అన్‌ అకాడమీ, టాటా గ్రూప్, బైజూస్‌ కూడా బిడ్స్ వేసి పోటీ పడినప్పటికీ డ్రీమ్‌ 11 ఎక్కువ బిడ్ చేసి స్పాన్సర్‌షిప్‌ దక్కించుకుంది. కాగా సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌ 13 వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu