దేశంలో కరోనా వైరస్ తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ భద్రతా సిబ్బందిలో ముందుగా ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలో ఇతరులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడంతో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 12 మంది సీఎం జైరాం ఠాకూర్ భద్రతా సిబ్బంది కాగా, ఒకరు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4250 కి చేరుకుంది. వీరిలో 2851 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1319 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu