ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 45 వేలు దాటింది. కొత్తగా 10276 కేసులు నమోదవడంతో ఆగస్టు 22, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 3,45,216 కు చేరుకున్నట్టు ప్రకటించారు. మొత్తం కేసుల్లో 3,42,321 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2895 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 3189 కి చేరింది. ఇప్పటికి 2,52,638 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో కలిపి మొత్తం 89389 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 31,91,326 కి చేరుకుంది.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 47989
- కర్నూల్ – 38150
- అనంతపూర్ – 34327
- గుంటూరు – 29885
- విశాఖపట్నం – 29353
- పశ్చిమ గోదావరి – 29189
- చిత్తూరు – 28896
- నెల్లూరు – 21376
- కడప – 20075
- శ్రీకాకుళం – 18222
- ప్రకాశం – 15658
- విజయనగరం – 15468
- కృష్ణా – 13733
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu