జనసేనానికి చెక్‌ పెట్టేందుకు జగన్ ప్లాన్?

Jagan's Plan To Check Janasena?, Jagan Plan, Check To Janasena, Kapu Leaders, Kapu Leader Mudragada To Campaign, Mudragada Campaign In Districts, YCP Mudragada Campaign In Districts, Campaign In Districts, Mudragada, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
kapu leader mudragada to campaign in districts for ycp telugu news

ఏపీ రాజకీయాల్లో కులాలది ప్రత్యేక పాత్ర. కుల ఓట్లు చాలా కీలకం. ముఖ్యంగా ఎస్సీ, బీసీతో పాటు ఓసీలోని కాపుల ఓట్లు ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాపుల ఓటర్ల సంఖ్య భారీగా ఉంటుంది. అందుకే వారిని ప్రసన్నం చేసుకుందుకే పార్టీలు అనేక ప్రణాళికలు రచిస్తుంటాయి. అప్పట్లో కాపులకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఇస్తామని చంద్రబాబు చెప్పారు.. అటు జగన్‌ కాపుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఇదంతా 2019నాటి ముచ్చట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాపులు ఓట్లు ఈసారి ఎవరికి పడతాయో చెప్పడం కష్టంగా మారింది. 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకే సపోర్ట్ ఇచ్చారు. అందుకే 32మంది కాపులుకు వైసీపీ సీట్లు కేటాయిస్తే అందులో 30మంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటికి దిగుతోంది. ఇది కాపు ఓట్లను టీడీపీకి షిఫ్ట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పవన్‌ కాపు కులానికి చెందినవాడు.

ముద్రగడ.. జోగయ్యా:

కాపు నేతల్లో ప్రముఖంగా వినపడే పేర్లు హరిరామజోగయ్యా.. ముద్రగడ పద్మనాభం. జోగయ్య మొదటి నుంచి పవన్‌కు మద్దతుదారు. అయితే పవన్‌కు కేవలం 21 అసెంబ్లీ సీట్లే కేటాయించడాన్ని ఆయన అంగీకరించలేదు. అప్పటినుంచి పవన్‌కు సపోర్ట్‌గా నిలవలేదు. అటు ముద్రగడ మొదటి నుంచి పచ్చి టీడీపీ వ్యతిరేకి. చంద్రబాబు హయంలో ముద్రగడను పోలీసులు హింస పెట్టారన్న ప్రచారముంది. ఈసారి ఆయన ముందుగా జనసేనలో చేరుతారన్న వార్తలు గుప్పుమన్నా అది జరగలేదు. ఆయన వైసీపీ పక్షానే నిలబడ్డారు. నిజానికి ముద్రగడను పవన్‌పై పోటిగా దింపురాని ఊహాగానాలు వినిపించాయి. అయితే అది కూడా జరగలేదు. అయినా కూడా ముద్రగడను వైసీపీ ఎన్నికల కోసం యూజ్ చేసుకోవాలని చూస్తోంది.

ప్రచారంలో ముద్రగడ:

మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం జిల్లాల వారీగా పర్యటించి వైసీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటివలి కిర్లంపూడిలోని ఆయన నివాసంలో గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు, వైసీపీ నేతలు ముద్రగడను కలిశారు. ముద్రగడ వైసీపీలో చేరిన నాటి నుంచి ఆయన నివాసం వివిధ జిల్లాల నుంచి తరలివస్తున్న మద్దతుదారులు, వైసీపీ నేతలతో కిటకిటలాడుతోంది. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు, కాపు నేతలు తమ నియోజకవర్గాల్లో పర్యటించి వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని ముద్రగడకు విజ్ఞప్తి చేశారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ముద్రగడ కూడా హామీ ఇచ్చారు. త్వరలో పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాజానగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా గెలుపు కోసం ప్రచారం చేస్తానన్నారు. మరి ఈ కాపు నేత కాపుల ఓట్లను వైసీపీకి పడేలా చేయగలరా అంటే వెయిట్ అండ్‌ సీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + nineteen =