అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల: అనుమతి ఉన్నవి, లేనివి ఇవే…

Coronavirus Lockdown, India Unlock 4, india unlock 4 india, India Unlock 4.0, India Unlock 4.0 News, India’s Unlock 4.0 Amid COVID 19, Indian Government, unlock 4, unlock 4 guidelines, unlock 4 guidelines india, unlock 4 india, Unlock 4.0 guidelines, Whats Allowed and Whats Not In unlock 4

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 29, శనివారం నాడు అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌లాక్‌ 4.0 లో అనుమతి లేనివి – (సెప్టెంబర్ 30 వరకు నిషేధం):

  • పాఠశాలలు, విద్యా సంస్థలు, మరియు కోచింగ్ సంస్థలు
  • సినిమా థియేటర్స్
  • స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్
  • ఇంటర్నేషనల్ ప్రయాణం (కేంద్రం అనుమతించిన ప్రయాణాలను మినహాయించి)

అన్‌లాక్‌ 4.0 లో అనుమతి ఇచ్చినవి:

  • సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల సేవలు ప్రారంభం
  • సాంఘిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కృతిక మరియు మతపరమైన సహా బహిరంగ సమావేశాలు సెప్టెంబర్ 21 నుండి 100 మందితో అనుమతించబడతాయి.
  • ఈ సమావేశాల నిర్వహణలో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి, సామాజిక దూరం, థర్మల్ స్కానింగ్ మరియు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్‌ల సదుపాయం తప్పనిసరి.
  • ఓపెన్ ఎయిర్ థియేటర్లు కూడా సెప్టెంబర్ 21 నుండి తెరవడానికి అనుమతించబడతాయి.
  • రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 50% టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందిని ఆన్‌లైన్ తరగతులు, సంబంధిత పనుల కోసం పాఠశాలకు హాజరయ్యేలా అనుమతించవచ్చు. సెప్టెంబర్ 21 నుండి కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాలలోని పాఠశాలకు మాత్రమే టీచర్లను అనుమతించాలి.
  • కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల 9 నుండి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలకు ఉపాధ్యాయుల సూచనలతో, స్వచ్ఛంద ప్రాతిపదికన వెళ్లొచ్చు. ఇది కూడా తల్లిదండ్రులు/సంరక్షకుల వ్రాతపూర్వక సమ్మతికి లోబడి అనుమతించబడుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu