తెలంగాణలో 13 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Coronavirus, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2924 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2924 కేసులతో కలిపి ఆగస్టు 29, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,090 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 818 కి పెరిగింది.

మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 90,988 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 1,638 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 31,284 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 13 లక్షలు దాటింది. శనివారం నాడు 61,148 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 13,27,791 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 35,763 పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =