సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగులు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

10 Lakh Employees Participate, Bank branches closed for next 4 days, Bank Strike, Bank strike news, Bank strike on March 15, Bank Unions Strike, Bank Unions Strike Started From Today against Privataization of PSBs, Banks to be Closed For 4 Days Straight, Mango News, Public Sector Banks May be Shut for Next 4 Four Days, Two-day Bank Unions Strike, Two-day Bank Unions Strike Started From Today, UFBU Calls For Nationwide Bank Strike, UFBU Calls For Nationwide Bank Strike On 15th And 16th

దేశంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) నేతృత్వంలో 9 బ్యాంక్ యూనియన్స్ మార్చి 15, 16 తేదీల్లో రెండురోజుల పాటుగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో డిపాజిట్స్, విత్ డ్రా, చెక్ క్లియరెన్స్ మరియు లోన్ అప్రువల్స్ సహా ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. అయితే ఏటీఎం సేవలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగనున్నాయి.

ఇటీవల కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన సమయంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వంటి 9 యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =