ఇంగ్లీష్ మీడియం: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Andhra Pradesh cabinet, Andhra Pradesh Cabinet meet today, Andhra Pradesh cabinet meeting, AP Cabinet Meeting, AP Cabinet Meeting 2020, AP Cabinet Meeting Highlights, AP Cabinet Meeting Key Decisions, Ap Cabinet Meeting Latest News, AP Cabinet Meeting Started at Secretariat

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియ అమలుపై ప్రభుత్వం, ప్రతివాదుల తరపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రతివాదులు అఫిడవిట్‌ దాఖలు చేశాకే స్టే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులను రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25 కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu