వచ్చే 6 నెలల్లో హుజురాబాద్, జమ్మికుంట రూపురేఖలు మారుస్తాం – మంత్రి ఈటల

Etala Rajender, Etala Rajender Review over Municipality Development, Huzurabad, Huzurabad Municipality Development, Jammikunta Municipality Development, Minister Etala Rajender, Minister Etala Rajender Meeting, Minister Etala Rajender Review over Huzurabad, Telangana Health Minister Etala Rajender

వచ్చే 6 నెలల్లో హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు మారుస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సెప్టెంబర్ 2, బుధవారం నాడు మాసాబ్ టాంక్ లోని సిడీఎంఏ కార్యాలయంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సిడీఎంఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్, జమ్మికుంట రెండు మున్సిపాలిటీలను మోడల్ టౌన్ లుగా తీర్చిదిద్దడానికి అవసరం అయిన కంప్రేహెన్సివ్ సిటీ డెవల్మెంట్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా కోరారు.

“హుజురాబాద్, జమ్మికుంట రెండు పట్టణాలు రెండు కళ్ళ లాంటివి. రెండు పట్టణాలు పెద్ద రోడ్లు వేసి పెట్టాము. 2014 లోనే తాగునీటి కోసం 40 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాము. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 40 కోట్ల అదనపు నిధులు మంజూరు చేశాను. వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టండి. నిధులు కొరత లేదు అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మార్పు కనిపించేలా అభివృద్ది చేయాలి” అని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

టౌన్ లలో ఉన్న పెద్ద రోడ్స్ అన్నిటికీ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్,డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ, పార్క్, ఫుట్ పాత్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్, వెజిటబుల్, నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డు, చెరువుల సుందరీకరణ, టాంక్ బండ్ ల నిర్మాణం, పందుల రీహాబిలిటేషన్, రింగ్ రోడ్డు నిర్మాణాల పై దృష్టి పెట్టాలని, ఒక సంవత్సరం లో మోడల్ టౌన్ లుగా చూడాలని మంత్రి ఆదేశాలిచ్చారు. పట్టణాల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ నీరు నిలవకుండా చూడండి. దోమల కు నిలయాలుగా మార్చవద్దు. నీళ్ళు నిలవడం అంటే అది కాన్సర్ పుండు లాంటిదే. ప్రాణాలు తీస్తుంది. రోడ్లు, డ్రెయిన్లు, టౌన్ ప్లానింగ్ రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా తయారు చేయాలి తప్ప తాత్కాలికంగా పనులు చేయవద్దని మంత్రి ఆదేశించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు అన్ని విభాగాల అధికారులతో ఒక టీం ను ఏర్పాటు చేసిన అరవింద్ కుమార్, వచ్చే వారంలో రెండు పట్టణాలలో పర్యటించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eleven =