సోమవారం ఏం జరగబోతోంది.. చంద్రబాబుకు ఊరట దక్కేనా?

what is going to happen on monday will chandrababu get relief,what is going to happen on monday,monday will chandrababu get relief,chandrababu get relief,Mango News,Mango News Telugu,AP ACB Court, AP CID, AP High Court, AP Politics, Chandrababu Naidu, Chandrababu Naidu Arrest, Skill Development Scam Case, suprem court,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,TDP Chief Chandrababu Naidu Latest News,TDP Chief Chandrababu Naidu Latest Updates

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రాష్ట్రం రణరంగంగా మారిపోయింది. నిరసనలు.. ఆందోళనలు.. దీక్షలతో అట్టుడుకుతోంది. దాదాపు నెల రోజుల నుంచి చంద్రబాబు జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. అసలు వార్తల్లో కూడా కనిపించని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. అటు నారా లోకేష్ న్యాయ స్థానాల చుట్టూ తిరుగుతూ చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బయటకు తీసుకొచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులను ఆశ్రయించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చంద్రబాబుకు మాత్రం ఊరట దక్కడం లేదు. అయితే సోమవారం పలు పిటిషన్లపై తీర్పులు వెలువడనున్నాయి. ఈక్రమంలో సోమవారం ఏం జరగబోతోందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఏపీ హైకోర్టు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. అలాగే ఏపీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా సోమవారం తుదితీర్పు రానుంది. అటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ తనపై పెట్టిన కేసు నిరాధారమని.. ఈ కేసును కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కూడా సోమవారం తుది తీర్పు వెలువడనుంది.

ఏపీ సీఐడీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూర్ చేస్తూ.. ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అవుతుంది. అలా కాకుండా మరోసారి కస్టడీకి ఇస్తే మాత్రం చంద్రబాబుకు కష్టాలు తప్పవు. అటు ఏపీ హైకోర్టు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసినా చంద్రబాబుకు కాస్త ఊరట దొరుకుతుంది. ఇక సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతుందా? లేదా? అనే డిస్కషన్ పాయింట్. ఎందుకంటే సెక్షన్ ఏ అన్నది అవినీతి చేసిన వారికి రక్షణ కవచంగా మారుతుందని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడ్డాకే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల మధ్య చంద్రబాబుకు సోమవారం ఎలా ఉండబోతోంది?.. ఊరట లభిస్తుందా?.. జైలు నుంచి బయటకు వస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. సోమవారం అన్ని న్యాయస్థానాల్లోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావాలని టీడీపీ నేతలు కోటి మొక్కులు మొక్కుతున్నారు. మరి చంద్రబాబుకు రిలీఫ్ లభిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =