వీఆర్వోల వద్ద నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

CS Somesh Kumar, Govt has Ordered VROs to Submit Revenue Records in Collectorates, Govt Ordered VROs to Submit Revenue Records, Somesh Kumar, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana News Today, Telangana Political News, VROs to Submit Revenue Records in Collectorates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంపై ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తు నిర్వహించి, ఆమోదం దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల వద్ద నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మ‌‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోగా రెవెన్యూ రికార్డులను క‌లెక్ట‌రేట్‌లో అప్ప‌గించాల‌ని వీఆర్వోల‌కు సూచించారు. రెవెన్యూ రికార్డుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల్లోగా పూర్తిచేసి, సాయంత్రంలోగా ఈ అంశంపై కలెక్టర్లు స‌మ‌గ్ర నివేదికను అందించాలని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేయబోయే కొత్త రెవెన్యూ చట్టంపైనా కీలకంగా చర్చించి ఆమోదించే అవకాశమునట్టు తెలుస్తుంది. అనంతరం రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu