తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?

TSPSC has Announced Group-4 Examination will be Conducted on July 1st,TSPSC Releases Group-2 Notification,TSPSC Group-2 Notification,TSPSC Notification,Mango News,Mango News Telugu,Group 2 Notification 2022 Telangana,Groups Notification 2022 Telangana,Group 4 Jobs Notification 2022 Telangana,Group 4 Jobs List In Telangana 2022 Notification,Group 4 Posts In Telangana 2022 Notification,Group 4 Notification 2022 Telangana Eligibility,Group 4 Notification 2022 Telangana Syllabus In Telugu,Group 4 Notification 2022 Telangana In Telugu,Telangana State Group 4 Notification 2022,Group 4 Notification 2022 Telangana Apply Online

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-4 పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-4 పేపర్‌-1 పరీక్షను జూలై 1, శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, అలాగే గ్రూప్-4 పేపర్‌-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లోని మొత్తం 8,180 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌, వార్డ్‌ ఆఫీసర్‌ సహా పలు రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు ముందుగా అధికారిక వెబ్ సైట్ లో https://www.tspsc.gov.in/ 2022, డిసెంబర్‌ 30 నుంచి 2023, జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగిస్తునట్టుగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-4 పోస్టుల కోసం జనవరి 30 నాటికే మొత్తం 8,47,277 మంది దరఖాస్తు చేసుకోగా, గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కాగా గ్రూప్-4 రాతను పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

గ్రూప్-4 పరీక్ష షెడ్యూల్‌:

  • పేపర్‌-1 జనరల్‌ స్టడీస్ – సమయం 2.30 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూలై 1 (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు)
  • పేపర్‌-2 సెక్రటేరియల్ ఎబీలిటీస్ – సమయం 2.30 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూలై 1 (మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here