నేడే సభలోకి కొత్త రెవెన్యూ చట్టం, మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

New Revenue Act, New Revenue Act Bill, New Revenue Act Bill to be Introduced Today, Revenue Act Bill, Telangana Assembly, Telangana Assembly 3rd Day, Telangana Assembly Session, Telangana Assembly Session 2020, Telangana Assembly Session today

తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల‌ కార్యక్రమం చేప‌ట్టారు. ప్ర‌శ్నోత్త‌రాలలో భాగంగా ఆరు ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. అనంతరం అర‌గంట పాటు జీరో అవ‌ర్ కొనసాగనుంది. అలాగే ఈ రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎలాంటి అవినీతికి చోటులేకుండా, ప్రభుత్వం సరికొత్తగా రూపొందించిన ఈ రెవెన్యూ చట్టంలో ఏఏ అంశాలు ఉన్నాయోనని ప్రజల్లో ఆసక్తి నెలకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu