ఏపీలో సెప్టెంబర్ 20 నుంచి సిటీ బస్సు సేవలు ప్రారంభం?

Andhra Pradesh, Andhra Pradesh City Bus Services, Andhra Pradesh State Road Transport Corporation, AP City Bus Services, AP News, APSRTC, APSRTC News, APSRTC To Start City Bus Services, APSRTC To Start City Buses, APSRTC Updates, City Bus Services in AP, City Bus Services in AP to Start, RTC to launch city bus services

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో సెప్టెంబర్ 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ, అనుమతి కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఫైల్‌ను పంపింది. ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత అనుమతి రాగానే సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో మే 21 నుంచే అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు మొదలైనప్పటికీ, సిటీ బస్సు సర్వీసులును మాత్రం ప్రారంభించలేదు. ముఖ్యంగా సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉండడంతో, అందుకు తగిన విధంగా సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu