తెలంగాణలో లక్ష 69 వేలు దాటిన కరోనా కేసులు, 1025 కి పెరిగిన మరణాలు

Covid-19 in Telangana - Positive Cases Cross 1 Lakh 69 Thousand and Deaths Reaches to 1025

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 69 వేలు దాటింది. సెప్టెంబర్ 18, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,169 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 54,459 శాంపిల్స్ పరీక్షించగా, 2123 కేసులు నమోదయినట్టు పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1025 కి పెరిగింది. రాష్ట్రంలో 1,37,508 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 30,636 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.28 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.60 శాతంగా ఉంది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2123):

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu