మందు ప్రియులకు గుడ్ న్యూస్, బార్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Andhra Pradesh, Andhra Pradesh Bars, Andhra Pradesh Bars Open, Andhra Pradesh News, ap bars open, AP Govt Gives Permission, AP Govt Gives Permission to Open Bars, AP Latest News, AP News

రాష్ట్రంలో నేటి నుంచి బార్లు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 22 న మొదటిసారిగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో బార్లు మూసివేసే ఉంచారు. తాజాగా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా బార్లు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న బార్ల లైసెన్స్‌ ఫీజులపై 20 శాతం కోవిడ్‌ ఫీజు విధిస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనుమతి ఉన్న 840 బార్ల లైసెన్సులను జూన్‌ 30, 2021 వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇక బార్లలో విక్రయించే విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, వైన్,‌ బీర్లుతో పాటుగా ఇతర రెడీ టు డ్రింక్ లు అన్నింటిపై అదనంగా 10 శాతం రిటైల్‌ ట్యాక్స్‌ వసూలు చేయనున్నారు. బార్ల లైసెన్సు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు సైతం 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలులో భాగంగా మద్యం దుకాణాలను, బార్ల సంఖ్యను తగ్గించుకుంటు వస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =