ఒకే రోజులో 82,753 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్

India Corona Updates: 73272 Positive Cases, 926 Deaths Reported in Last 24 Hours

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లోనే 73272‌ కేసులు, 926 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 10, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 69,79,423 కు, మరణాల సంఖ్య 1,07,416 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 59 లక్షలు దాటింది. ఒకే రోజులో 82,753 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటికి డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 59,88,822 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 85.8 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా నమోదైంది. ఇక దేశంలో కరోనా యాక్టీవ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులవరకు 10 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల్లో ఉంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 10, ఉదయం 8 గంటల వరకు):

  • దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 69,79,423
  • కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 9– అక్టోబర్ 10 (8AM-8AM)] : 73272
  • నమోదైన మరణాలు : 926
  • డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 59,88,822
  • యాక్టీవ్ కేసులు : 8,83,185
  • మొత్తం మరణాల సంఖ్య :1,07,416

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu