సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ కన్నుమూత

CPI Senior Leader Gunda Mallesh Passes Away

సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. సింగరేణిలో ఉద్యోగానికి రాజీనామా చేసి, సీపీఐ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో ఉండే నాయకుడిగా గుండా మల్లేశ్ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గుండా మ‌ల్లేశ్ మృతి ప‌ట్ల సీపీఐ పార్టీ సహా పలు పార్టీల నాయ‌కులు సంతాపం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్ధం గుండా మ‌ల్లేశ్ పార్థివదేహాన్ని నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌ లో ఉంచనున్నారు. అనంతరం బెల్లంపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu