కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

Chanchalguda Jail, Keesara Ex-MRO Nagaraju Commits Suicide, Keesara Ex-MRO Nagaraju Commits Suicide In Chanchalguda Jail, Keesara MRO Nagaraju Suicide, Keesara MRO Nagaraju Suicide News, MRO Nagaraju Commits Suicide, MRO Nagaraju Commits Suicide In Chanchalguda Jail, telangana

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం తహసీల్దార్‌ నాగరాజు ఓ భూవ్యవహారంలో ఓ వ్యక్తి నుండి ఒక కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అవినీతి, లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన చంచల్‌గూడ జైలులో ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu