విద్యుత్ శాఖలో పనిచేసే ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay Writes to CM KCR on Solving Problems of the Employees Working in the Power Sector,Bandi Sanjay Writes to CM KCR,CM KCR on Solving Problems of the Employees,Employees Working in the Power Sector,CM KCR on Employees Working in the Power Sector,Mango News,Mango News Telugu,Bandi Sanjay Writes Problems of the Employees Working in the Power Sector,Hold Talks with Power Staff or Face Stir,Resolve Power Employees Demands,Address Woes of Power Employees,Bandi Sanjays letter to CM KCR,Telangana BJP Chief urges CM,CM KCR News And Live Updates,Telangana BJP Chief Bandi Sanjay Kumar,Bandi Sanjay Latest News

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టడం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని, దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమని అన్నారు. ఆర్టిజెన్లు, ఉద్యోగుల పట్ల విద్యుత్ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కనీసం శ్రద్ధ చూపకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కనబరుస్తుందని, జీపీఎఫ్, పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజెన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొన్నారు. “ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. కొత్త పీఆర్సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. పదవీ విరమణ సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ లు, పీఆర్సీ, జీపీఎఫ్ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించని పక్షంలో తెలంగాణ ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాను” అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =