అద్దంకి దయాకర్‌కు నిరాశ

Announcement of Congress MLC Candidates, MLC Candidates Congress, Congress Announcement of MLC Candidates, Congress, Congress MLC Candidates, Adnaki Dayakar, Mahesh Kumar Goud, State President of NSUI, Balmuri Venkat, Latest MLC Candidates News, MLC Candidates News Update, Congress News, Polictical News, MLC Elections, Mango News, Mango News Telugu
Congress,Congress MLC candidates,Adnaki Dayakar , Mahesh Kumar Goud, State President of NSUI, Balmuri Venkat

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ హైకమాండ్ ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసి  అధికారికంగా ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజు అంటే జనవరి 18 వరకూ గడువు ఉంది.

ముందుగా అద్దంకి దయాకర్‌,  బల్మూరి వెంకట్‌కు పార్టీ అవకాశం ఇచ్చినట్టు గట్టిగా ప్రచారం జరిగింది. కానీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అవకాశం ఇవ్వడానికి పార్టీ మొగ్గు చూపించింది. ఎమ్మెల్యేల కోటాలో..2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉండటం వల్ల 2 స్థానాలనూ గెలుచుకునే అవకాశముంది.

ఎంబీబీఎస్‌ చదివిన బల్మూరి వెంకట్‌  హుజూరాబాద్‌ బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  టికెట్‌ ఆశించినా  నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చాలాసార్లు ఆందోళనలు చేపట్టి.. పార్టీలో గుర్తింపు పొందారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి  ఆయన అత్యంత సన్నిహితుడు.

మరోవైపు చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న అద్దంకి దయాకర్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యింది.అయితే తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడంపై మాట్లాడిన అద్దంకి దయాకర్ .. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని   చెప్పారు.

ఇంతకంటే మంచి స్థానం తనకు ఇవ్వడానికి పార్టీ చూస్తోందని తాను భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఇప్పుడు పదవి రాకపోవడం వల్ల తనపైన ఏదో కుట్ర జరుగుతుందని భావించడం సరైంది కాదని.. అధిష్టానం నిర్ణయాలను గౌరవించాలసిన అవసరం తనపై ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనను మరింత ముందుకు తీసుకువెళ్లడమే ఇప్పుడు తన లక్ష్యమని అద్దంకి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =