మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు, వదంతులు నమ్మొద్దు :‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

Hyderabad Metro Rail, Hyderabad Metro Rail MD, Hyderabad Metro Rail MD NVS Reddy, Hyderabad Metro Rail MD NVS Reddy Condemns Rumours over Metro Pillars, Metro Rail MD NVS Reddy, Metro Rail Rumors, Rumours on Metro Pillars, Rumours over Metro Pillars

హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వరద నీటి దాటికి మూసాపేట ప్రాంతంలో మెట్రో పిల్లర్ల చుట్టూ భూమి కుంగిపోయి నీరు చేరుకుంది. దీంతో మెట్రో పిల్లర్లకు ప్రమాదమంటూ ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. మెట్రో పిల్లర్లలకు ప్రమాదమంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రోడ్లపైకి భారీ వరద నీరు చేరడంతో మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉండే మట్టి కొట్టుకుపోయిందని అన్నారు. అక్కడి పరిస్థితిని ఇంజినీర్లు పర్యవేక్షిస్తునట్టు తెలిపారు. పిల్లర్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని, పుకార్లు, వందతులు నమ్మొద్దని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రజలను కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu