ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

PM Modi - CM KCR And CM YS Jagan Extends Ugadi Wishes To The People

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగులో ట్వీట్ చేశారు. “ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నానని” మోదీ పేర్కొన్నారు. “రాష్ట్రాన్ని, ప్రజలను సంతోషంతో, శ్రేయస్సుతో, మంచి ఆరోగ్యంతో దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ప్రజలకు ఉగాది (తెలుగు నూతన సంవత్సరం) శుభాకాంక్షలు తెలిపారు.

“తెలుగు ప్రజలందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కరోనా విపత్తు తొలగిపోయి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఈ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ” తెలుగు లోగిళ్ళలో వెల్లివిరిసే సంస్కృతి, సంప్రదాయాలకు, కొత్త చిగురులు తొడిగే ప్రకృతి తోడై… అత్యంత శోభాయమానంగా రానున్న శుభాలకు సంకేతంగా ఆరంభమయ్యే నూతన సంవత్సరమే ఉగాది. అలాంటి ఉగాది సంబర వేళ కరోనా కలకలంతో ఎక్కడ చూసినా స్తబ్ధత నెలకొంది. మరేం పరవాలేదు. ఉగాది అంటేనే చిగురించే ఆశలకు సంకేతం. ఈ ఉగాది నుండి కరోనా మహమ్మారి కనుమరుగవ్వాలని ఆశిద్దాం. అందుకోసం ఉగాది వేడుకలను మన ఇంటి గడప వరకే పరిమితం చేసుకుందాం. బయట తిరగకుండా అందుబాటులో ఉన్న వాటితోనే పండుగ చేసుకుందమంటూ” టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శార్వరి నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 15 =