తెలంగాణలో రెండ్రోజులు సెలవులు, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచన

Heavy Rains In Hyderabad, Heavy rains lash Hyderabad, Hyderabad Rain Today, Hyderabad Rains, Hyderabad Rains news, Minister KTR, Minister KTR Review on Relief Measures, Telangana Govt Announces Two Days Holidays, Telangana rains, telangana rains news, telangana rains updates, Two Days Holidays in the State Due to Heavy Rains

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజులనుంచి కురుస్తున్న అతిభారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోయింది. దీంతో భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు(ఈరోజు, రేపు) సెలవులు ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల ప్రభావం అధికంగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రెండ్రోజులు సెలవు ఇస్తున్నట్టు ప్రకటించారు.

మరో మూడు రోజుల పాటుగా వర్షాలు పడే అవకాశం ఉండడంతో అత్యవసర పరిసితుల్లో తప్ప, నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇళ్లల్లో పిల్ల‌లు, వృద్ధులు పట్ల జాగ్ర‌త్త‌ వహించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ఉంటున్న ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను, పోలీసు శాఖ‌ను, స్థానిక సంస్థల అధికారులను ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసి, సహాయకచర్యలు పట్ల కీలక ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =