హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఘనంగా కైట్‌ ఫెస్టివల్‌.. ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Minister Talasani Srinivas Yadav Inaugurates Kite Festival at Peoples Plaza Hyderabad Today, Kite Festival at Peoples Plaza Hyderabad, Minister Talasani Srinivas Yadav Inaugurates Kite Festival, Hyderabad Kite Festival, Telangana Kite Festival, Hyderabad Peoples Plaza, Minister Talasani Srinivas Yadav, Kite Festival, Kite Festival 2023, Hyderabad Kite Festival News, Hyderabad Kite Festival Latest News And Updates, Hyderabad Kite Festival Live Updates, Mango News, Mango News Telugu

సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో కైట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ అతిథిగా విచ్చేసి దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన చిన్నారులకు పతంగులు పంచారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇది పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉండే సమయమని, అలాగే ఆడపడుచులు రంగురంగుల ముగ్గులతో గొప్పగా జరుపుకునే పండుగ ఇదేనని పేర్కొన్నారు. తన చిన్నప్పుడు తోటి పిల్లలతో కలిసి పతంగుల పండుగ జరుపుకునేవాళ్లమని తలసాని నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం కనిపించడంలేదని, నేటి యువత విదేశీ కల్చర్‌కు అలవాటుపడుతున్నారని అన్నారు. దీనిపై ప్రతి చిన్నారుల తల్లిదండ్రులు దృష్టి సారించాలని, మన సంస్కృతి గురించి వారికి తెలిసేలా చేయాలని, అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ పండుగలను కొనసాగించేలా వారిని ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here