అమెరికా ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ: ట్రంప్ కు 213, జో బైడెన్ కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు

US Election Results 2020 Live Updates: Trump Gets 213, Joe Biden Gets 238 Electoral Votes Till Now

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య స్వల్ప తేడానే ఉండడంతో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో 270 ఎలక్టోరల్‌ ఓట్లు గెలుచుకున్న వారు అధ్యక్ష పీఠం దక్కించుకుని శ్వేతసౌథంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకు కౌటింగ్ పూర్తైన రాష్ట్రాలను బట్టి జో బైడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా, ట్రంప్‌ కు 213 ఓట్లు వచ్చాయి.

డోనాల్డ్ ట్రంప్ 23 రాష్ట్రాల్లో విజయం సాధించగా, 20 రాష్ట్రాల్లో జో బిడెన్ విజయం సాధించారు. ఇంకా మిగిలిన 7 రాష్ట్రాలైన విస్కాన్సిన్‌, అలస్కా, జార్జియా, మిషిగాన్‌, నెవాడ, నార్త్‌ కరోలినా, పెన్సిల్వీనియా రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. వీటిల్లో నాలుగు చోట్ల ట్రంప్ పూర్తి ఆధిక్యంలో ఉండగా, 3 చోట్ల బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు పక్రియ ఆలస్యం అవుతుండడంతో ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో తేలడానికి మరి కొన్ని గంటల సమయం పట్టనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =