నవంబర్ 15 లోపు బుద్ధవనం ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud held a Review Meeting on Buddhavanam Project Development Works

తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత బుద్దవనం ప్రాజెక్టుపై రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుద్ధవనం ప్రాజెక్టును బుద్దిజం, ఆచార్య నాగార్జునుడు చరిత్ర, మహయాన బుద్దిజం సహా ఇతర చరిత్ర విశిష్టతలపై ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లబించే విధంగా అధ్బుతంగా తీర్చిదిద్దాలని బుద్ధవనం, టూరిజం, హెరిటేజ్ తెలంగాణ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక, వారసత్వ ప్రదేశాలను ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన పాలకులు నిర్లక్ష్యం చేసారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక , వారసత్వ ప్రదేశాలను గుర్తించి అభివృద్ది చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ కు చెందిన వైతాళికులు, చరిత్రకారులు, కవులు, సాహితి వేత్తలు, మేదావులను గుర్తించి వారి చేసిన సేవలను బావితరానికి అందించాలనే సంకల్పంతో వారి జయంతి, వర్థంతి లను, వారి తిరిగాడిన ప్రాంతాల అభివృద్ది కి అనేక ప్రణాళికలను రూపోందిస్తున్నామన్నారు. బుద్దిస్టు చారిత్రక ప్రదేశాలైన ఫణిగిరి, ధూళికట్ట , బుద్దవనం మొదలైన ప్రాంతాల అభివృద్దికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో దోరికిన చారిత్రక అవశేషాలతో పాటు పణిగిరి, నాగార్జున సాగర్ లో దొరికిన చారిత్రక అవశేషాలను, చరిత్రక విగ్రహాలను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. అవసరమైతే హెరిటేజ్ తెలంగాణ అధికారులను పంపి రాష్ట్రానికి చెందిన చారిత్రక అవశేషాలను తిరిగి రప్పించేందుకు కృషిచేస్తామన్నారు.

ఆచార్య నాగార్జునుడు బుద్ధుడు బోధనలు ఇక్కడ నుండి చేసారన్నారు. ఆచార్య నాగార్జునుడు బోధనలు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పోందాయన్నారు. వారి బోదనలను ప్రపంచ వ్యాప్తం చేయటానికి ఆసియా ఖండంలోనే పెద్ద ప్రాజెక్ట్ బుద్ధవనం ను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించామన్నారు. బుద్దవనం నిర్మాణ పనులు నవంబర్ 15 లోపు పూర్తి చేస్తున్నామన్నారు. బౌద్దమతంలోని మహాయనం పుట్టిన గడ్డ నాగార్జున సాగర్ ను ప్రపంచ పటంలో తెలంగాణ టూరిజం మ్యాప్ ను తీర్చిదిద్దేలా ఈ బుద్దవనం ప్రాజెక్టు ను సుమారు 100 కోట్లతో నిర్మించామన్నారు. వచ్చే 15 రోజుల్లో బుద్దవనం ప్రాజెక్టును మరోసారి సందర్శించి ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు అందజేస్తామన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత బుద్ధవనం ప్రాజెక్టు లో పర్యావరణహిత పర్యాటక రిసార్టులు, సాహస క్రీడలు, బోటింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా ఫుడ్ కోర్టులు, పార్కింగ్ తో పాటు టూరిజం వసతి సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటితో పాటు బుద్ధవనం ప్రాజెక్ట్ వద్ద ఆర్కియాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. టూరిజం డెవలప్ మెంట్ పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర అర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్న పలు చారిత్రక , పురావస్తు శాఖల ప్రదేశాలలో ఉన్న చారిత్రక నేపధ్యాన్ని తవ్వకాలు జరిపేందుకు అవసరమైన అనుమతులు, పర్యాటక ప్రదేశాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందివ్వాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. బుద్ధవనం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేసిన అన్ని శాఖలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + twelve =