మోహిదీప‌ట్నంలో స్టీల్ స్కైవాక్‌ నిర్మాణానికి ఆమోదం, త్వ‌ర‌లోనే టెండ‌ర్లకు ఆహ్వానం

Detailed Design of Pedestrian Skywalk at Mehdipatnam, KTR Approved Detailed Design of Pedestrian Skywalk, Mehdipatnam pedestrian skywalk, Mehdipatnam Skywalk, Minister KTR, Minister KTR Approved Detailed Design of Pedestrian Skywalk, Pedestrian Skywalk at Mehdipatnam, Pedestrian Skywalk Mehdipatnam News, Skywalk at Uppal junction

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటైన మెహిదీప‌ట్నం వ‌ద్ద పాదచారుల కోసం స్కైవాక్‌ ను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ లకు రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఆమోదం తెలిపిన‌ట్లుగా రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్ తో స్కైవాక్ ను నిర్మించనున్నట్టు తెలిపారు. అక్కడి రైతుబజార్ లో రెండు లిఫ్టులతో పాటుగా, మొత్తం 16 లిఫ్ట్ ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ స్కైవాక్ ప్రాజెక్టులో భాగంగా అక్కడి బస్ షెల్టర్లు కూడా రీడిజైన్ చేయబడతాయని అన్నారు. హెఛ్ఎండీఏ త్వ‌ర‌లోనే స్కైవాక్ నిర్మాణానికి టెండ‌ర్లను ఆహ్వానించ‌నుందని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 9 =