డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Releases Rs 600 Crore to Construction Of Double Bed Room Houses

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తుంది. ఇప్పటికే దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావోస్తుండగా, ఇటీవలే జియాగూడ‌, క‌ట్టెల మండి, గోడే కి క‌బ‌ర్‌ లాంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూ.600 కోట్ల నిధులను విడుదల చేసింది. నిధుల విధులపై రాష్ట్ర గృహనిర్మాణశాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేయగా, తాజాగా మరో రూ.600 కోట్లు మంజూరు చేస్తునట్టు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3,750 కోట్లను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ