ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలో వారం పాటు పాఠశాలలు ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకే…

Telangana Schools Timings Revised for One Week due to Heat Wave Forecast, Schools Timings Revised for One Week due to Heat Wave Forecast, Telangana Schools Timings Revised for One Week, Heat Wave Forecast, Schools Timings Revised for One Week, Telangana Schools Timings, Schools Timings, Heat Wave, Heat Wave Forecast In Telangana, Telangana Schools Timings Revised Latest News, Telangana Schools Timings Revised Latest Updates, Severe Heat Wave Conditions in the State, Severe Heat Wave In Telangana, Telangana, heat wave In Telangana, severe heat wave condition In Telangana, severe heat wave conditions prevailing in the Telangana state, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మరి కొద్దీ రోజుల పాటుగా ఎండ తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హీట్ వేవ్ సూచన దృష్ట్యా రాష్ట్రంలో హాఫ్ డే పాఠశాలల సమయాన్ని మార్చి 31 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ మేనేజ్‌మెంట్ పరిధిలోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 8:00 గంటల నుండి 11:30 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.

అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మార్చి 31 నుండి ఏప్రిల్ 6 వరకు ఉదయం 11:30 గంటల లోపు అందించాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అమలును పర్యవేక్షించాలని హెడ్ ఆఫ్ ది డిపార్మెంట్స్ కు, రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =